చీరల వ్యాపారం కోసం వెళ్లిన భర్త.. ఇంట్లో భార్య రాసలీలలు.. ఎండ్ కార్డు ఎలా పడిందంటే..

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (15:03 IST)
కుటుంబ పోషణ కోసం భర్త కాశీ చీరల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ నగరానికి వెళ్లాడు. ఇంటిపట్టున కుదురుగా ఉండాల్సిన భార్య... వీధుల్లో కాయకూరలు అమ్ముకునే చిరు వ్యాపారితో అక్రమం సంబంధం పెట్టుకుంది. చివరకు హైదరాబాద్ నుంచి తిరిగివచ్చిన భర్తను తన ప్రియుడుతో కలిసి బండరాయితో కొట్టిచంపేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం మల్కాపురంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మల్కాపురం గ్రామానికి చెందిన కాశీ, సౌభాగ్య అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరూ కలిసి అనంతపురం గ్రామీణ ప్రాంతంలోని కుక్కలపల్లిలో తోపుడుబండిలో టమోటా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఈ వ్యాపారంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో భర్త కాశీ చీరల వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకోసం హైదరాబాద్ వెళ్లాడు. 
 
భర్త ఇంటిపట్టున లేకపోవడంతో సౌభాగ్యలో కామకోర్కెలు ఎక్కువయ్యాయి. దీంతో తమ వీధిలోకి కాయకూరలు అమ్ముకునేందుకు వచ్చే చిరు వ్యాపారి నవాజ్ బేగ్‌తో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని పరిస్థితికి వెళ్లారు. ఈ విషయం ఆ నాటో ఈనోటా పడి గ్రామంలోని వారందరికీ తెలిసిపోయింది. 
 
ఈ క్రమంలో చీరల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నగరానికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న కాశీ.. భార్యను, ఆమె ప్రియుడుని చంపేస్తానని బెదిరించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సౌభాగ్య.. తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. తమ పథకంలో భాగంగా భర్త కాశీని అనంతపురం శివారులో ఉన్న మామిడితోటలోకి తీసుకెళ్లి, ఫుల్‌గా మద్యం తాపించారు. 
 
ఆ తర్వాత తన ప్రియుడు నవాజ్‌తో కలిసి భర్త తలపై భార్య పెద్ద బండరాయితో కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింద. అయితే, సౌభాగ్య అక్రమ సంబంధం గురించి ఊరి సభ్యులందరికీ తెలియడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆమె అన్ని విషయాలను పూసగుచ్చినట్టు చెప్పింది. దీంతో  సౌభాగ్యతో పాటు ఆమె ప్రియుడు నవాజ్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు