జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది శివారులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవి ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్(20), కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు. అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటుంది.
ఈ క్రమంలో ఆమెకు రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలో స్థానిక పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.