అయితే, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చిన స్వామికి భార్యపై అనుమానం పెరిగింది. తనను కాదని పరాయి వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందన్న అనుమానం పనుభూతమైంది. దీంతో ఆమెను నిత్యం వేధించసాగాడు.
ఈ విషయంపై పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అయితే, పుట్టింటివారితో పాటు కులపెద్దలు సర్దిచెప్పడంతో ఆమె భర్త వద్దనే ఉంటూ వచ్చింది. అప్పటికీ భర్త వేధింపులు ఏమాత్రం తగ్గలేదు కదా అతని ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పు రాలేదు.
అయితే, శనివారం ఉదయం భార్యను పత్తి ఏరేందుకు చేనుకు రమ్మని స్వామి కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరగడంతో భార్యపై స్వామి చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె... ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. విషయం తెల్సిన నవిత తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి భర్త, ఆమె అత్త, బావలే కారణమంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.