అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అంతర్గత అవయవాలను శుభ్రపరచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్నాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇది మంచి ఆరోగ్యానికి అవసరం. కణాలు, కణజాలాలు, ఎముకలు, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. ఈ పుట్నాలను తీసుకుంటే చర్మం నుండి దద్దుర్లు, గజ్జి, తామరలను త్వరగా తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మంపై ముడతలను తొలగిస్తుంది.
ఈ పుట్నాలను ఎక్కువగా తింటే జుట్టు రాలడం వుండదు. శిరోజాలు నెరిసిపోవడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. గర్భిణీ స్త్రీలు పుట్నాలను సరైన నిష్పత్తిలో తీసుకోవడం వల్ల వారికి గర్భస్థ శిశువుకు మేలు జరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పి, శారీరక అలసట నుండి ఉపశమనం పొందడంలో పుట్నాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.