తమిళ హీరో ఆర్యపై చీటింగ్ కేసు : రాష్ట్రపతికి జర్మన్ మహిళ ఫిర్యాదు

శుక్రవారం, 30 జులై 2021 (11:09 IST)
కోలీవుడ్ హీరో ఆర్యపై ఓ జర్మన్ మహిళ చీటింగ్ కేసు పెట్టింది. పైగా, రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారంటూ అందులో పేర్కొంది. 
 
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. తనవద్ద నుంచి రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో కంప్లైంట్ చేసింది. తామిద్దరి మధ్య జరిగిన వాట్సాప్​ చాట్​ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. 
 
ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.
 
నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్​ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్​లో కలుసుకున్న ఆర్య- సాయేషా లవ్‌లో పడ్డారు. 2019 మార్చి 10న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ మూవీ చేసింది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఇదిలావుంటే, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్పట్టా పరంబరై' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌తో ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా, ఇందులో హీరో ఆర్య బాక్సర్‌గా అదరగొట్టేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు