బెంగాల్‌లో దారుణం... ప్రేమను తిరస్కరించిన యువతిపై కత్తితో దాడి (Video)

ఠాగూర్

శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (10:55 IST)
ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ  కిరాతక ప్రేమికుడు ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాష్ట్రంలోని బెల్గోరియాలో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన యువకుడుని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇదే.. 

 

వెస్ట్ బెంగాల్: బెల్గోరియాలో లవ్ ప్రపోసల్ రిజెక్ట్ చేసిందని
ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన యువకుడు.

దాడి చేసిన యువకుడిని పట్టుకొని చితకబాదిన స్థానికులు. #ViralVideo #WestBengal #newsUpdates #Bigtvlive pic.twitter.com/wE4Ids0WPs

— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు