ఈ నేపథ్యంలో అతను పనిచేసే ఫైనాన్స్ సంస్థ మూతపడింది. ఉద్యోగం కూడా పోయింది. అదే సమయంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఇంట్లో వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంట్లో ఒప్పుకోవడం లేదని, తాను కూడా పెళ్లి చేసుకోనని అమ్మాయి తేల్చిచెప్పడంతో విరక్తి చెందిన ఎల్లేష్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఎల్లేష్ చెప్పినట్టుగానే తాను ఉంటున్న గదిలోకి వెళ్లి తలుపులు పెట్టి ఫ్యాన్ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.