ఎలాంటి వివాదాలకు, డబుల్ మీనింగులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రోగ్రామ్స్ చేయడం ఈటీవీకే చెల్లిందన్న మాట ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదంటున్నారు. దీనికి కారణం బబర్దస్త్, పటాస్ షోలే అనే చర్చ జరుగుతోంది. ఈమధ్యే ఈటీవీ ప్లస్ ప్రారంభించి అందులో కూడా జబర్దస్త్, పటాస్ షోలు రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఆయనకు చెడ్డపేరునే తెస్తున్నాయి.
ఒక మీడియా మొఘల్ రామోజీరావు, ప్రజాప్రతినిధి రోజా, మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు ఇంతటి చీప్ ట్రిక్స్ చేస్తూ ద్వంద్వార్థాల ప్రోగ్రామ్ అవసరమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగుల కోసం రామోజీరావు ఈ దుస్థితికి దిగజారడం కరెక్టేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రామోజీరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.