ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (20:22 IST)
దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రరాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులు నిర్వహించారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులుగా పనిచేయడం ఈయన ప్రత్యేకత. ఈయన కాంగ్రెస్‌ పార్టీ తొలి దళిత అధ్యక్షులు కూడా. 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది.
 
సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఒక దళిత కుటుంబంలో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబంలో చివరి సంతానం దామోదరం సంజీవయ్య. ఆయన కుటుంబానికి సొంత భూమి లేకపోవడంతో నేత పని, రోజు కూలి చేస్తూ జీవించేవారు. సంజీవయ్య పుట్టిన మూడు రోజులకే తండ్రి మునెయ్య చనిపోయాడు. దీంతో కుటుంబం మొత్తం మేనమామతో కలిసి ప్యాలకుర్తికి వెళ్లింది. అక్కడ సంజీవయ్య పశువులను కాసేవాడు. మూడు సంవత్సరాల తరువాత సంజీవయ్య తిరిగి పెద్దపాడు గ్రామానికి చేరుకున్నాడు. సంజీవయ్య అన్న చిన్నయ్య కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు. పెద్దపాడు గ్రామంలో 4వ తరగతి వరకు చదివి ఆ తరువాత కర్నూలులోని అమెరికన్‌ బాప్టిస్టు మిషన్‌ పాఠశాలలో చేరాడు. 1935లో కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో ఎస్‌ఎస్‌ఎల్‌సి జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడు.
 
ఆ తరువాత చిన్నయ్య ఆర్థిక సాయంతో అనంతపురం జిల్లా ప్రభుత్వ సీడెడ్‌ జిల్లాల కళాశాలలో గణితం, ఖగోళ శాస్త్రములు అధ్యయనం చేశాడు. 1942లో బి.ఎ పూర్తి చేశాడు. ఆ తరువాత జీవనోపాధి కోసం అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వలన ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్‌ ఆఫీసులో గుమాస్తాగా 48.80 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. 1944 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖ తనిఖీ అధికారిగా బళ్లారిలో పని చేశాడు. ఈ గజిటెడ్‌ హోదా గల ఉద్యోగం డిసెంబర్‌ 1945లో రద్దయ్యే దాకా 11 నెలల పాటు పని చేశాడు. 
 
ఆ తరువాత కొంత సమయం మద్రాసులోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పని చేశారు. సంజీవయ్య 1946లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కె.ఆర్‌.కృష్ణయ్య శెట్టి ప్రోత్సాహంతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్‌.ఎల్‌'లో చేరారు. అప్పట్లో కాలేజీ స్కాలర్‌షిప్పులు వచ్చే పద్ధతి లేదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్‌లోని ప్రోగ్రెసీవ్‌ యూనియన్‌ ఉన్నత పాఠశాలలో పార్ట్‌టైం గణిత అధ్యాపకునిగా పని చేశారు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతంతో హాస్టల్‌ ఖర్చులు భరించుకునేవారు. లా పట్ట తీసుకుని సంజీవయ్య 1950 అక్టోబర్‌లో మద్రాసు బార్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
 
సంజీవయ్య విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాత్రంత్యోద్యమంపై ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటీస్‌ చేస్తున్న సమయంలో వివిధ రాజకీయ నాయకుల పరిచయం, సాంగత్యం వలన రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆసక్తి ఆయనకు కలిగింది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులో, ఇంగ్లీషులో ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్‌ పార్లమెంట్‌గా అవతరించింది. అయితే ప్రొవిజనల్‌ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండింట్లో సభ్యత్వం ఉన్న సభ్యులు ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. 
 
షెడ్యూల్డ్‌ కులమునకు చెందిన ఎస్‌.నాగప్ప తన శాసన సభ సభ్యత్వము అలాగే పెట్టుకుని ప్రొవిజనల్‌ పార్లమెంట్‌కు రాజీనామా చేశారు. ఆస్థానం పూర్తి చేయడానికి బెజవాడ గోపాల రెడ్డి, ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్‌ కమిటీ తరపున సంజీవయ్యను ఎంపిక చేశారు. ఎన్నికలు జరిగి తొలి విధాన సభ ప్రమాణస్వీకారం చేయడంతో 1952 మే 13న ప్రొవిజనల్‌ పార్లమెంట్‌ రద్దయింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్‌ పార్లమెంట్‌గా అవతరించింది. 
 
అయితే ప్రొవిజనల్‌ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండింట్లో సభ్యత్వం ఉన్న సభ్యులు ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. షెడ్యూల్డ్‌ కులమునకు చెందిన ఎస్‌.నాగప్ప తన శాసన సభ సభ్యత్వము అలాగే పెట్టుకుని ప్రొవిజనల్‌ పార్లమెంట్‌కు రాజీనామా చేశారు. ఆస్థానం పూర్తి చేయడానికి బెజవాడ గోపాల రెడ్డి, ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్‌ కమిటీ తరపున సంజీవయ్యను ఎంపిక చేశారు. ఎన్నికలు జరిగి తొలి విధాన సభ ప్రమాణస్వీకారం చేయడంతో 1952 మే 13న ప్రొవిజనల్‌ పార్లమెంట్‌ రద్దయింది.
 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సు రూట్లను జాతీయకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా ఉన్న దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకొచ్చారు. కాబట్టి సంజీవయ్య శాసనసభలో సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి. సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పార్టీ పెట్టుకున్నారు. 
 
1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సంజీవయ్య పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవా చేశారు. 1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య గవర్నర్ కు రాజీనామా సమర్పించారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఆయనలో కించిత్ బాధ కూడా కన్పించేది కాదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సంజీవయ్య రాసిన “లేబర్‌ ప్రాబ్లమ్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌” పుస్తకాన్ని ఆక్స్‌ఫర్డ్‌ వారు ప్రచురించారు.
 
1976లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. 1972 మే 7న ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆయన స్మారకార్థం పాటిగడ్డ సమీపాన ఒక ఉద్యానవనం పెంచి ఆయన పేరుమీదుగా సంజీవయ్య పార్కు అని పేరు పెట్టారు. 2008లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ లా యూనివర్శిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012లో దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీ అని పేరు మార్చారు.

వెబ్దునియా పై చదవండి