ఒకప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. అలాంటి ఇలాంటి ఊపు కాదు జయలలిత, కరుణానిధి మధ్యే మొత్తం రాజకీయాలు తిరిగేవి. అన్నాడిఎంకే నుంచి జయలలిత, డిఎంకే నుంచి కరుణానిధిలు మాత్రమే సిఎం అయ్యేవారు.
అన్నాడిఎంకే గెలవడం ఏ మాత్రం సాధ్యం కాదని విశ్లేషకుల భావన. పళణిస్వామి, పన్నీరుసెల్వం ఇద్దరు కూడా పార్టీలో నాయకులే తప్ప పార్టీని నడిపించే సత్తా వారికి లేదని..దీంతో ప్రత్యామ్నాయం డిఎంకే మాత్రమేనని అందరూ భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో అళగిరి తమ్ముడు స్టాలిన్ పై పగతీర్చుకోవడానికి సిద్థమయ్యారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.
డిఎంకేలో తనకున్న పరిచయాలతో ఆ పార్టీలోని నేతలను బయటకు తీసుకొచ్చి పార్టీని చీల్చి చివరకు స్టాలిన్ ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుపడుతున్నారట స్టాలిన్. ఇప్పటికే అందుకే సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. స్వయంగా ఈ విషయాన్ని అళగిరి ప్రకటించారట. దీంతో రాజకీయంగా తమిళనాడులో పెద్ద చర్చే జరుగుతోంది. అన్న ఎత్తులను చిత్తు చేయడానికి కూడా స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారట. మరి చూడాలి..తమిళనాడు రాజకీయాల్లో అన్నదమ్ముల వైరం ఏ స్థాయికి వెళుతుందో..?