అయితే జగన్ సతీమణి భార్య భారతికి మాత్రం షర్మిలకు ఏర్పడిన దుస్థితి ఏర్పడదని రాజకీయ పండితులు అంటున్నారు. వైకాపా ప్రచారకర్తగా ఆమె వ్యవహరించినా.. ఆమె అన్నయ్య వుండగా టీవీల ముందు ఏమాత్రం కనిపించదని వారు చెప్తున్నారు. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్. విజయమ్మ విశాఖ నుంచి పోటీ చేసి పరాజయం పాలైంది.
ఇక రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల వైఎస్సార్సీపీ ప్రచారకర్తగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టు తీర్పు (ఏప్రిల్ 28న) ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా, పార్టీని నడిపించే బాధ్యతను వైఎస్. భారతి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా, వైఎస్.భారతి సాక్షి పత్రికను నడిపే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో పార్టీని నడిపే బాధ్యతలు కూడా భారతికి అప్పగించాలని జగన్ భావిస్తున్నారు.