బాలీవుడ్‌లో ఒకప్పటి హీరోయిన్‌గా రాణించిన తను తనూ శ్రీ దత్త మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల ఆమె సినిమాలకు దూరంగా వుంటోంది. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
ఈ మీటూ మూమెంట్ సౌత్‌కి కూడా విస్తరించింది. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు ముందుకు వచ్చి తాము కూడా వేధింపులకు గురైనట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇలా తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తను శ్రీ దత్తా తెలిపింది. తనని ఇంట్లో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్లీజ్ ఎవరైనా సాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమె తన బాధలు చెబుతూ కన్నీరు మున్నీరయ్యింది. ఆరేళ్లుగా ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నట్టు తెలిపింది.
ఇందులో తను శ్రీ దత్తా చెబుతూ, "నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. ఏమీ మాట్లాడలేకపోతున్నా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. పోలీసులకు ఫోన్ చేశాను, వారు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు.
బహుశా రేపో ఎల్లుండో పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను. నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. భద్రత లేకుండా పోయింది. పనిమనిషిని కూడా పెట్టుకోలేకపోయాను. గతంలో వచ్చిన పనివాళ్లు వస్తువులు దొంగిలించారు. అంతా నేనే చూసుకోవాల్సి వస్తోంది" అని తెలిపింది.