రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

ఠాగూర్

బుధవారం, 23 జులై 2025 (11:37 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా వివాహం చేసుకున్నారా? అని ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా.. అలాగే, పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేనని ఆమె అన్నారు. 
 
విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం "సర్.. మేడమ్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్ర ప్రచారం కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, ప్రేమ గురించి ఎన్నో సంవత్సరాల క్రితం ఆలోచించాను. ఇపుడు దానికి నా జీవితంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం కారణంగా సోల్‌మేట్ ఉండటం అనివార్యమని గతంలో అనిపించేది. అతని కోసం వెతికిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, మనం వేరేరకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని తర్వాత అర్థం చేసుకున్నాను. 
 
ప్రతి ఒక్కరికీ ప్రేమించిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యం కాదు కదా.. రతన్ టాటా కూడా వివాహం చేసుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే. అది జరిగినా జరగకపోయినా మార్పు ఉండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగానే నేను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకుసాగాలి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు