దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తల్లో సర్ సీవీ రామన్ ఒకరు. ఈయన కేఎస్ కృష్ణన్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలతో కలిసి 1928లో సరిగ్గా ఇదే రోజున రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. ఆయన ఆవిష్కరణలకు గౌరవ సూచకంగా ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ఆవిష్కరణకుగాను సర్ సీవీ రామన్‌కు 1930లో సైన్స్ నోబెల్ బహుమతి కూడా వరించింది.
కాంతి కిరణం పారదర్శక వస్తువు గుండా వెళితే.. దాని తరంగ తరంగదైర్ఘ్యం మారుతుందని సీవీ రామన్ నిరూపించారు. దీనినే రామన్ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్ ఇప్పటికీ చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. చంద్రయాన్-1 మిషన్‌లో చంద్రుడిపై నీటి జాడను ప్రకటించినప్పుడు దాని వెనుక రామన్ స్పెక్ట్రోస్కోపీ అద్భుత కృషి కూడా దాగుంది.