ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీ దేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.
ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకలవిద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.
సరస్వతి దేవికి పూజా విధానం..
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది.