తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 'సరైనోడు' దొరికాడా? కానీ ఎడమ చేత్తో స్వీట్ తినిపించారే..(ఫోటోలు)

మంగళవారం, 31 అక్టోబరు 2017 (16:50 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర పాలక పార్టీని ఎదుర్కొనే సరైనోడు రేవంత్ రెడ్డి దొరికాడని ఇప్పుడంతా అనుకుంటున్నారు. ఆది నుంచి కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ దూకుడుగా వెళ్తున్న రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీకి టన్నులకొద్దీ శక్తి వచ్చేసిందని ఆ పార్టీలోని కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు నాయకులైతే ఐరెన్ లెగ్ వచ్చేస్తోందని భయం వ్యక్తం చేస్తున్నారు. 
 
రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళ్ల కింద చెప్పుల్లా, తలపైన గొడుగులా ప్ర‌జ‌లు ఉండ‌ద‌ల్చుకోవ‌డం లేద‌ంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసినా ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారంటూ ఆయన తెలిపారు. అంతేకాదు... పుస్త‌కాలు ప‌క్కన పెట్టి విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తూనే ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులనంతా పక్కనపెట్టేశారని మండిపడ్డారు. 
 
ఆరు ద‌శాబ్దాల తెలంగాణ ప్ర‌జ‌ల‌ క‌ల‌ను సోనియా గాంధీ సాకారం చేశారనీ, ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామ‌ని అన్నారు. ఎన్నో ఆశ‌ల‌తో చేసిన‌ పోరాటాల‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందనీ, ఆత్మ‌ బ‌లిదానాలు చేసుకున్నవారి సాక్షిగా ఏర్ప‌డిన తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లను కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దగల సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద పార్టీ మారుతూనే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు