తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోందని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాక ముందు కేసీఆర్ చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బతుకమ్మ చీరల కోసమా తెలంగాణకు సాధించుకుంది అంటూ విమర్శించారు. గొర్రెలు, బర్రెలు కోసమా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి రాజీనామాపై నల్గొండలో తెలుగుతమ్ముళ్లు ఫైరయ్యారు. రేవంత్‌తో పాటు జిల్లాలో మరికొంత మంది నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారని వార్తలు రావడంతో ఆగ్రహించిన తమ్ముళ్లు ఫెక్ల్సీలను చింపేశారు. రేవంత్‌తో పాటు కంచర్ల భూపాల్ రెడ్డి, బిల్యానాయక్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు మరో పార్టీలోకి మారాడాన్ని జీర్ణించుకోలేని కార్యకర్తలు వాటిని చింపేసి తగలబెట్టారు. అనంతరం వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లెక్సీలు దగ్ధం చేయడంపై రేవంత్ రెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.