ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.. మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు

బుధవారం, 31 మే 2023 (12:32 IST)
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ "మనకు ఆహారం కావాలి, పొగాకు కాదు"గా నిర్ణయించారు. 2023 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం రైతులకు ప్రత్యామ్నాయ పంటల ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ అవకాశాల గురించి  అవగాహన పెంచడం, పోషకాలతో కూడిన పంటలను పండించేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్థిరమైన పంటలతో పొగాకును పండించడాన్ని నిరోధించవచ్చు. తద్వారా ప్రపంచ ఆహార సంక్షోభానికి దోహదపడుతుంది.
 
పొగాకు పెంపకం- ఉత్పత్తి ఆహార అభద్రతను పెంచుతుంది. పెరుగుతున్న ఆహార సంక్షోభంతో సంఘర్షణలు, యుద్ధాలు, వాతావరణ అపరిణామాలు ఏర్పడేందుకు కారణం అవుతున్నాయి.   
 
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 3.5 మిలియన్ హెక్టార్ల భూమి పొగాకు సాగు కోసం మార్చబడుతుంది. పొగాకును పెంచడం కూడా సంవత్సరానికి 200 000 హెక్టార్ల అటవీ నిర్మూలనకు కారణం అవుతోంది.
 
పొగాకు పెంపకం కోసం వనరులు చాలా ఎక్కువ అవసరం. ఇది మట్టి క్షీణతకు కారణం అవుతుంది. ఎలాగంటే పొగాకు సాగు కోసం పురుగుమందులు మరియు ఎరువులు అధికంగా ఉపయోగించడం అవసరం. కాబట్టి పొగాకును పండించడానికి ఉపయోగించే భూమి ఆహారం వంటి ఇతర పంటలను పండించడానికి తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 
మొక్కజొన్న పెంపకం, పశువుల మేత వంటి ఇతర వ్యవసాయ కార్యకలాపాలతో పోలిస్తే, పొగాకు వ్యవసాయ భూములు ఎడారీకరణకు ఎక్కువ అవకాశం ఉన్నందున పర్యావరణ వ్యవస్థలపై పొగాకు పెంపకం చాలా విధ్వంసక ప్రభావాన్ని చూపుతుంది. 
 
పొగాకు ఉత్పత్తి.. స్థిరమైన ఆహార ఉత్పత్తికి జరిగిన నష్టాన్ని పూడ్చలేవు. ఈ నేపథ్యంలో, పొగాకు సాగును తగ్గించి, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తికి రైతులు ముందుకొచ్చేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
2023 WNTD ప్రకారం.. పొగాకు రైతులకు, వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని అందించే ఆహార పంటలకు మారడానికి మార్కెట్ పరిస్థితులను కల్పించాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు