పవన్‌ కళ్యాణ్ పంథాను ఫాలో అవుతున్న జగన్... ఆయన సత్తా అంతేనా?

శుక్రవారం, 20 జనవరి 2017 (14:12 IST)
కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన ఏ నాయకుడు అయినా పార్టీ స్థాపిస్తున్నాం అనగానే మాకు అధికారం ఇచ్చి చూడండి. ఏదేదో చేసేస్తాం అంటూ ఉంటారు. అది అందరూ చెప్పే మాటే. అధికారంరాక ముందర వారు చేసే ప్రతి పొలిటికల్ యాక్టివిటీ కూడా కొన్ని దశాబ్ధాలుగా అందరూ చేసేదే చేస్తున్నారు. పరమ రొటీన్ కూడా వారి రాజకీయ ప్రసంగాల దగ్గర నుంచి అభ్యర్థులని కులాలకీ, మతాలకీ సంబంధించి ఓటు బ్యాంకుల లెక్క వేసుకుని సెలక్ట్ చేసుకుంటారు.
 
అయినా కానీ మాది పాత పద్దతి కాదు కొత్తగా ఇరగదీస్తాం అంటూ చెప్పుకుంటుంటారు. ఉదాహరణకి వైకాపా నేత జగన్మోహన్‌ రెడ్డినే తీసుకుంటనే ఆయన ఓదార్పు యాత్రలకీ, పరామర్శ యాత్రలకీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. రాజధాని నిర్మాణం గురించి గత ఎన్నికల కంటే ముందర కూడా ఆయన దగ్గర సరైన ప్లాన్ లేదు. ఒక పక్క చంద్రబాబునాయుడు ఏదో కిందా మీద పడుతుంటే ఆయన్ని విమర్శించడం తప్ప సరైన విధానం ఏంటో చెప్పడు జగన్‌. 
 
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను తాను అనుకుంటున్న పరిష్కారాలు ఏంటో కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. చంద్రబాబును విమర్శించడం తప్ప ఎవ్వరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ హీరో పవన్‌ కళ్యణ్‌ మాత్రం అలా కాదు. తాను అలాంటి ఒక మామూలు చౌకబారు రాజకీయవేత్తని కాను అని పవన్ రోజు రోజుకీ ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఉద్ధాన బాధితులందరి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేం కానీ వాళ్ళకు ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఈ విషయంలో మాత్రం పవన్‌ కళ్యాణ్‌ని పలు వెబ్‌సైట్లు ప్రశంసించాయి. 
 
జగన్‌ కూడా ఇప్పుడు పవన్‌ను చూసి స్ఫూర్తి పొందినట్టున్నారు. కొత్తగా ఏదో ఒక సమస్యని టేకప్ చెయ్యాలి అనేది జగన్ కొత్త ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి పరిసరాల్లో ఉన్న కిడ్నీ బాధితుల్ని కలవడం కోసం జగన్‌ వెళుతున్నారు. ఇది బాగానే ఉంది కానీ పవన్‌ని ఇంత పబ్లిక్‌గా కాపీ కొట్టడం ఎంతవరకూ కరెక్టనేది వైకాపా నేతల సూటి ప్రశ్న. అంతా మార్చేస్తాం అంటూ కొత్త కహానీలు చెప్పి ఇప్పుడు ఒకరి పంథాని కాపీ కొట్టుకుంటూ వెళ్ళడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. 

వెబ్దునియా పై చదవండి