కావలసిన పదార్థాలు: మైదాపిండి: రెండు కప్పులు కొబ్బరి తురుము: రెండు కప్పులు బియ్యం పిండి: రెండు కప్పులు తెల్ల నువ్వులు: రెండు స్పూన్లు రవ్వ: ఒక కప్పు బటర్: రెండు టేబుల్ స్పూన్లు కారం: రెండు టీ స్పూన్లు ఇంగువ పొడి: రెండు చిటికెలు ఉప్పు: తగినంత
తయారీ విధానం: మైదాపిండిని, రవ్వను తేలికపాటి తెల్ల వస్త్రంలో కట్టి కుక్కర్లో ఐదునిమిషాలు ఆవిరిచేయండి. ఆరిన తర్వాత పిండి జల్లెడలో జల్లించి ఆ పిండిని ఓ బౌల్‌లో తీసుకోండి. ఈ పిండితో బియ్యం పిండి, తెల్ల నువ్వులు, రవ్వ, బటర్ కలిపి మురుకుల పిండిలా చేసుకోండి. మురుకుల గిద్దల్లో మురుకుల్లా నూనెలో వేయించి దించేయండి. మైదాతో మురుకులు రెడీ.