ఇవి కాకుండా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే చిత్రంలో తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన నటించడానికి ఆమె సంతకం చేసింది. పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇది భాగ్యశ్రీ తన ఎదుగుతున్న కెరీర్‌లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇక, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చేసిన పి మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేనితో కలిసి మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. మరి లక్ అంటే ఇదేనేమో.