ఆరు లోక్ సభ స్థానాలలో మొదలైన పోలింగ్... 2014 ఎన్నికలు బోణి

సోమవారం, 7 ఏప్రియల్ 2014 (12:51 IST)
FILE
ఎన్నికలు 2014 సమరం ప్రారంభమయింది. అసోం, త్రిపురల్లో 16వ లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో భాగంగా 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్ లో భాగంగా అసోంలోని తేజ్‌పూర్, కలియాబోర్, జొర్హాత్, దిబ్రూగఢ్, లఖింపూర్ స్థానాలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. త్రిపుర నియోజకవర్గాలలోనూ పోలింగ్ ఒకింత మందకొడిగా సాగుతోంది. ఎన్నికల దృష్ట్యా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి