బాలకృష్ణకు మూడు ఆనందాలు... గెలిస్తే మంత్రి ఛాన్స్...
గురువారం, 15 మే 2014 (21:07 IST)
WD
నందమూరి బాలకృష్ణకు ఒకేరోజు మూడు ఆనందాలు వచ్చేనా...? కలిగేనా...? అంటూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆయన నటించిన 'లెజెండ్' చిత్రం రేపటితో అంటే మే 16కు 50 రోజులు పూర్తి చేసుకుంటుంది.
కాగా అదేరోజు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి. గెలిస్తే ఎం.ఎల్.ఎ.గా ఆయన రియల్ లైఫ్లో అడుగుపెడతాడు. అదేరోజు తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధిస్తే అధికారంలోకి వస్తుంది. అంతేకాదు... మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.
ఈ మూడు విషయాలపై అభిమానులు తెగ టెన్షన్లో ఉన్నారు. బాలయ్య అనుకున్నట్లు జరిగితే ఆయన్ను ఆనందంలో ముంచెత్తేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో...?