నటి నగ్మాకు భద్రత పెంచాలి : ఈసీకి కాంగ్రెస్ లేఖ!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (13:37 IST)
File
FILE
మీరట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సినీ నటి నగ్మాకు మరింత భద్రత కల్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు.. స్థానిక కార్యకర్తలు, అభిమానుల నుంచి నగ్మాకు ముప్పు ఉందని, అందువల్ల ఆమెకు భద్రత కల్పించాలని ఈసీకి రాసిన లేఖలో కోరింది.

ఇటీవల మీరట్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సినీ నటి నగ్మాను చూసేందుకు, పట్టుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. అదేసమయంలో ఓ యువకుడు ఆమెను ముట్టుకోవడంతో అక్కడే అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వార్త కాస్తా కలకలం రేపింది. ఈ క్రమంలోనే రక్షణ కోరినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి