సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

దేవీ

మంగళవారం, 22 జులై 2025 (20:03 IST)
Pawan Kalyan - Mangalagiri pressmeet
చిరంజీవి లాంటి అన్నయ్య వుండీ ఖుషి వంటి సినిమాల విజయాల తర్వాత జానీ సినిమా చేశాను. కానీ ఆడలేదు. ఫస్ట్ షో పడి ఆడలేదు. వెంటనే డిస్ట్రిబ్యూటర్లంతా నా ఇంటిమీదకు వచ్చారు. కానీ లాభాల్లో వాటా ఇవ్వలేదుకదా.. అనిపించింది. అందుకే రెమ్యునరేషన్ వదులుకున్నా. సినిమా చేశామ్. బాగాలేదు. అంతే.. దాని గురించి ఆలోచిస్తే.. ఏంచేయలేం. అందుకే ఆ అనుభవంతో ఒంటరివాడినయ్యా. ఆ ఒంటిరితనం, జానీ ఫెయిల్యూర్ అనేది రాజకీయాల్లో బాగా బలాన్ని ఇచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
హరిహరవీరమల్లు సినిమా ప్రమోషన్ లో భాగం కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
మీ నిర్మాత లాస్ లో వున్నారనే ముందుకు వచ్చారా?
జానీ టైంలో వున్నప్పటి  నిర్మాతలకు అన్ని ఇబ్బందులేవు. కానీ ఈ హరిహరవీరమల్లు నిర్మాత ఎ.ఎం. రత్నం గారు సినిమా రిలీజ్ కు ఇబ్బందులు పడుతుంటే బాధ అనిపించింది. అందుకే దగ్గరుండి ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళాలనిపించింది.
 
కొంతమంది థియేటర్ల ఇవ్వడంలేదనే విమర్శ వుంది. మరి మీకు ఆ అనుభవం వుందా?
అలా కొంతమంది థియేటర్ల ఇవ్వరని అనుకోను. నాకు అలాంటి అనుభవం లేదు.
 
హరి హర వీరమల్లు పార్ట్ 2 ఎంతవరకు వచ్చింది?
30 శాతం వరకు షూటింగ్ చేశాం.
 
ఎ.పి.కి సినిమా పరిశ్రమ తరలివస్తుందా?
సినిమా పరిశ్రమ ఇక్కడకు రావాల్సిన పనిలేదు. హైదరాబాద్ లోనూ, ఇక్కడా వుండాలి. అయితే ఇక్కడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫిలిం మేకింగ్ స్కూల్స్ డెవలప్ చేయాలి.
 
మీ సినిమాను సహచర ఎం.ఎల్.ఎ.లతో చూస్తారా? చంద్రబాబు గారికి చూపిస్తారా?
ఇంతవరకు మా కూటమి ఎం.ఎల్.ఎ.లకు షో వేసి చూపించాలనే ఆలోచన లేదు. ఇప్పడు ఆలోచిస్తాను. చంద్రబాబునాయుడుగారు చాలా బిజీ ఆయన చూసే టైం వుంటుందో లేదో చెప్పలేను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు