బర్మేర్ టిక్కెట్‌పై అలిగిన జశ్వంత్ సింగ్.. బీజేపీకి గుడ్‌బై!

శనివారం, 22 మార్చి 2014 (12:48 IST)
File
FILE
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు బర్మేర్ స్థానం కేటాయించలేదని సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ బీజేపీ అగ్రనేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆయన ఆదివారం బీజేపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమచారం.

రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జశ్వంత్ సొంత జిల్లా. దాంతో, లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే, టిక్కెట్ల కేటాయింపు దగ్గర మాత్రం బీజేపీ మడతపేచీ పెట్టింది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సిఫార్సుతో కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన సోనారాం చౌదరికి ఆ టిక్కెట్‌ను కేటాయించింది. దాంతో, తీవ్ర అసహనానికి గురైన జశ్వంత్ పార్టీని వీడాలని, బార్మేర్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి