లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న అంశంపై తమ పార్టీ అగ్రనేత ఎల్కే. అద్వానీకి పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అద్వానీ కోరుకున్న లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించే అంశంపై చిన్నపాటి వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. అంతేకాకుండా, ప్రస్తుత నాయకత్వం బీజేపీ సీనియర్ నేతలను పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.
వీటిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. తాము సీనియర్ నాయకులను పక్కనబెట్టే ప్రశ్నేలేదన్నారు. పార్టీలో విభేదాలు లేవని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సీనియర్ నేత అద్వానీకి చాయిస్ ఇచ్చామని, ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్ ఎంచుకున్నారని తెలిపారు.
ఇక టికెట్ దక్కని కారణంగానే జశ్వంత్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆయనను ఎల్లప్పుడూ గౌరవించిందని, రాజ్యసభకు పంపిందని వెంకయ్య గుర్తు చేశారు. పార్టీ ఆయనను ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమించిందని చెప్పుకొచ్చారు.