దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం ఏడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖల జాతకాలు తేలనున్నాయి. ఈ దశలో జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న పలువురి భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
ఇలాంటి వారిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ (వడోదర), కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయ్ బరేలీ), బీజేపీ అగ్రనేతలు అద్వానీ (గాంధీనగర్), బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ (లక్నో), మురళీ మనోహర్ జోషి(కాన్పూర్)లు ఉన్నారు.
అలాగే, అరుణ్ జైట్లీ (అమృత్ సర్), ఉమా భారతి (జాన్సీ)తో పాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (మెదక్), కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి (మహబూబ్ నగర్), కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ (మల్కాజ్‌గిరి), మరో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ (మధేపురా) తదితరులు ఉన్నారు.