మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోడీ : చిత్రపటం చిచ్చు!

మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:54 IST)
File
FILE
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య ఓ చిత్రపటం పెద్ద చిచ్చురేపింది. ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మాటల యుద్ధానికి తెర తీసింది.

ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరేంద్ర మోడీ... మమతపై విమర్శల వర్షాన్ని కురిపించారు. శారదా చిట్స్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సుదీప్తసేన్ మమత చిత్రపటాన్ని రూ.1.8 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా తన అక్రమార్జనలో ఆమెకు వాటా ఇచ్చారని ఆరోపించారు.

దీనిపై మమత సహా ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. మోడీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనమవుతుందని, ఆయన ప్రధాని అయితే దేశానికి పీడకలలేనని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్ల రూపకర్త నుంచి అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన దుస్థితిలో బెంగాల్ లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి