వారణాసి ప్రజలు పోటీ చేయమంటే బరిలో ఉంటా : కేజ్రీవాల్

సోమవారం, 17 మార్చి 2014 (14:33 IST)
File
FILE
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి ఎంపీ సీటు నుంచి స్థానిక ప్రజలు పోటీ చేయమంటే ఖచ్చితంగా బరిలోకి దూకుతానని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇదే అంశంపై ఈనెల 23వ తేదీన వారణాసిలో నిర్వహించే ర్యాలీలో ప్రజలు అభిప్రాయాలను తెలుసుకుంటానని ఆయన సోమవారం ప్రకటించారు.

ఈ స్థానం నుంచి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనపై పోటీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌కు పలువురు సూచిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'మోడీపై పొటీ చేయాలని పార్టీ నన్ను కోరింది. దీంతో వారణాసిలో పోటీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ గెలుపా, ఓటమా అన్నది ముఖ్యం కాదు. ఈ నెల 23న వారణాసిలో జరిగే ర్యాలీలో పాల్గొంటా. పోటీ చేయాలా, వద్దా నేరుగా ప్రజలనే అడుగుతా. వారు చేయమంటే చేస్తా, లేకుంటే లేదు' అని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి