సీఎం పదవికి రాజీనామా చేసి తప్పు చేశా : కేజ్రీవాల్

శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (15:04 IST)
File
FILE
తాను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడం తాను చేసి అది పెద్ద తప్పు అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ... అవును... నేను తప్పు చేశాను. రాజీనామా చేయడం తప్పేనని, ఢిల్లీ సీఎంగా అధికారం చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదని కేజ్రీవాల్ అంగీకరించారు.

రాజీనామా చేయడానికి సైద్ధాంతిక కారణాలున్నా, రాజీనామా చేసిన సమయం సందర్భం మాత్రం పొరపాటేనని ఆయన అంగీకరించారు. ప్రజలకు మరింత వివరణను ఇచ్చి, సభలు పెట్టి, మా అభిప్రాయాన్ని చెప్పి, ఆ తర్వాత రాజీనామా చేసి ఉంటే బాగుండేదేమో. అలా చేయకుండా నేరుగా రాజీనామా చేయడం వల్ల ప్రజలకు మా పట్ల అనుమానాలు పెరిగాయి. వారు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఏఏపీ ప్రభుత్వం 49 రోజులకే కుప్పకూలడంతో ఆమ్ ఆద్మీ మద్దతుదారుల్లో నిరాశ, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న విషయం తెల్సిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం చేస్తుండగా కేజ్రీవాల్ పై రాళ్లు విసరడం, లెంపకాయ వేయడం వంటి ఘటనలు జరిగాయి. మొన్న అయితే లాలీ అనే ఆటో డ్రైవర్ సుల్తాన్ పూర్‌లో కేజ్రీకి మెడలో పూలమాల వేసి మరీ చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ సంఘటనల నేపథ్యంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి