కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బట్టలూడదీసి ఇటలీకి పంపిస్తామంటూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హీరా లాల్ రేగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీని గుజరాత్‌లా మార్చాలని ప్రయత్నిస్తే నరేంద్ర మోడీని ముక్కలుగా నరికేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే.
తాజాగా రాజస్థాన్ రాష్ట్రం రిజర్వుడ్ స్థానమైన నివై ఎమ్మెల్యే హీరా లాలా నిగేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే... సోనియా, రాహుల్ గాంధీల గుడ్డలూడదీసి వారిని ఇటలీకి పంపించేస్తామని బీజేపీ నేత హీరాలాల్ రేగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్‌లోని టోంక్ నియోజకవర్గంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దుమారం చెలరేగడంతో... క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనుంది.