మీరు ఏ రంగులో హ్యాండ్‌బ్యాగ్‌లు వాడుతున్నారు?

శనివారం, 22 మార్చి 2014 (17:13 IST)
File
FILE
ఆధునిక నాగరికత పెరుగుతున్న కొద్ది యువతరం ఫ్యాషన్‌కు పెద్దపీట వేస్తోంది. డ్రస్‌కోడ్ నుంచి నెయిల్ పాలిష్ వరకు యువతరం ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. ఇందులో యువకులు జీన్స్, టీ షర్ట్స్ వంటి తదితర వస్తువులపై ఎక్కువ మోజు పెడుతుంటే.. యువతుల సంగతి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దుస్తుల నుంచి మేకప్ వస్తువుల వరకు యువతులు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పాలి. అయితే యువతరం కొనుగోలు చేస్తున్న హ్యాండ్ బ్యాగ్‌లు, స్టైలిష్ టోపీలు కాస్త ఫెంగ్‌షుయ్ ప్రకారం కొనినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇందులో భాగంగా.. యువతులు, లేదా మహిళలు ఫెంగ్‌షుయ్ రంగులను బట్టి పర్సులు, హ్యాండ్‌బ్యాంగ్‌లు కొనడం మంచిది. ఇక్కడ హ్యాండ్ బ్యాగులను ఆకారం, రంగును బట్టి ఎంచుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. సాధారణంగా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఆకుపచ్చ, నలుపు, గోధుమ వర్ణంగల హ్యాండ్‌బ్యాగులు మంచివి. అదే చతురస్రాకారం ఉన్న బ్యాగులయితే తెలుపురంగువి మంచివని ఫెంగ్‌షుయ్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇక తలకు ధరించే టోపీల విషయానికొస్తే.. అవి నలుపు రంగు లేదా నీలం రంగు తప్ప ఏ రంగువైనా మంచి ఫలితాలనిస్తాయి. ఆ రెండు రంగుల టోపీలను మినహాయించి వేరే ఏ రంగు టోపీ అయినా కొనుక్కోవచ్చునని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి