చైనా వాస్తు శాస్త్రం ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటి స్థలానికి బయట, కొద్దిగా దగ్గరగా నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. కానీ ఇంటి స్థలంలోని ఈశాన్య దిశలో వృక్షాలుంటే ఇంటి యజమానికి హానికలిగిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ దుష్పలితాలు కలిగించే దిశలో చెట్లుంటే దానివైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మాములు అద్దం పెట్టండి.
స్థలం ఎక్కువైనప్పుడు చెట్లను నాటడం చేసుకోవచ్చు. సాధారణంగా మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదనే అనుమానం వద్దు. దీని వెనక ఉన్న అసలు విషయమేమిటంటే.. మూల దోషం ఉన్న చోట మొక్కలు నాటితే మొక్కలు విడిచే ఆక్సిజన్ ఆ ప్రాంతంలో నింపడమే. దోషంలోని విషవాయువులను లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ను మొక్కలు పీల్చుకుంటాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.