బంతి, చేమంతి వంటి పుష్పాలతో బతుకమ్మను అందంగా తయారుచేస్తారు. ముఖ్యంగా తంగేడు, గునగ పూలు, ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక విశాలమైన పళ్ళెంలో రంగురంగుల పూలను ఒక క్రమపద్ధతిలో పేరుస్తారు.
పేలపిండి, బెల్లం, పిండివంటలతో కూడిన వాయనాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా జరుపుకునే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.