కేరళ మహాబలి రాక్షసుడిచే పాలించబడింది. మహాబలి పాలించినప్పుడు కేరళ కీర్తి ప్రతిష్టలతో పాటు ఎన్నో విజయాలను చూసింది. రాష్ట్రంలో ఎవరూ కూడా విచారంగా లేరు. ధనిక, పేద అనే తేడాలు లేవు. నేరం, అవినీతి లేదు. దొంగతనానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే రాత్రి తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.
ప్రజలలో మహాబలిరాజు చాలా ప్రాచుర్యం పొందాడు. పేద ప్రజలకు ఆయన తక్షణమే సాయం చేశాడు. అయితే శ్రీమహావిష్ణువు వామనుడి అవతారంలో ఆయన వద్ద దానంగా మూడు అడుగుల స్థలం కోరిక కథ అందరికీ తెలిసిందే. వచ్చింది విష్ణువని తెలిసీ.. తనకు అంతం ఖాయమని తెలిసీ.. తన గురువైన శుక్రాచార్యుడు చెప్పినా.. పట్టించుకోకుండా విష్ణువుకు దానం ఇచ్చిన ఘనుడు బలి చక్రవర్తి.