జయ ఏకాదశి.. పసుపు రంగు దుస్తులు.. అరటిపండు దానం

మంగళవారం, 31 జనవరి 2023 (22:16 IST)
మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. భక్తులు ఈ రోజు ఉపవాసం మరియు పూజలు చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహాన్ని కోరుకుంటారు. అలాగే జయ ఏకాదశి రోజున నదీస్నానం చేయడం ద్వారా పాపాలను దూరం చేసుకోవచ్చు. 
 
ఈ రోజున విష్ణువును దర్శనం చేసుకోవడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకే  ఏకాదశి రోజున విష్ణు దేవాలయ దర్శనం చేసుకోవాలి. 
 
ఇంకా పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. అలాగే పసుపు రంగు వస్తువులను దానం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. పూజానంతరం కుంకుమ, పసుపు లేదా అరటిపండును దానం చేయాలి. తులసీని తప్పకుండా పూజలో వాడాలి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు