వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 18 ఆగస్టు 2018 (12:10 IST)
సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో లభిస్తాయి. దయాగుణ, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు రోజున వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తుంటారు. కుటుంబ సభ్యుల సంక్షేమ కోసం మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తుంటారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలితాలనిస్తుందో వరలక్ష్మీ వ్రతం కూడా అంతటి ఫలితాలనిస్తుంది.
 
జగన్మాత పార్వతీ దేవి ఒకరోజు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుని అడిగారు. అప్పుడు శివుడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే సిరసంపదలు, సౌభాగ్యం లభిస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన కథను పార్వతి పరమేశ్వరుని అడిగారు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని చేయమని కోరింది. 
 
ఉదయాన్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారు ఈ వ్రతాన్ని ఆచరించమని చూచించారు. పెద్దలు, కుటుంబ సభ్యుల సహకారంలోత చారుమతి వ్రతాన్ని చేశారు. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు చేసి తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి స్వరూపాన్ని ప్రతిష్టించి ఈ వ్రతాన్ని నిర్వహించింది చారుమతి. 
 
ఈ విధంగా చారుమతి వ్రతాన్ని నిర్వహించి సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్లు శివుడు వ్రత వివరాలను పార్వతికి వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన ఈ వ్రతమే వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినమున మహిళలు ఈ వ్రతాన్ని చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు