ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా స్పెయిన్ - పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హురాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ కెప్టెన్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన స్టామినాను మరోమారు చూపించాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రొనాల్డో.. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రొనాల్డో.. ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు.
మ్యాచ్ తొలి అర్థభాగంలో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది. కానీ ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్ల జోరుకు ఆ ఆధిపత్యం తగ్గిపోయింది. స్పెయిన్ ఆటగాడు డీగో కోస్టా 24వ నిమిషంలో గోల్ చేయగా స్కోర్స్ సమం అయ్యాయి. ఆ తర్వాత 44వ నిమిషంలో రొనాల్డో మరో గోల్ సాధించాడు. ఆ వెంటనే కోస్టా 55వ నిమిషంలో మరో గోల్స్ సాధించాడు. ఆ టీమ్‌కు చెందిన నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు.