రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇందులోభాగంగా, మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ పోటీలో ఫ్రాన్స్ - బెల్జియం జట్లు నువ్వానేనా అని తలపడనున్నాయి. అంటే ఫైనల్ కానీ ఫైనల్‌లా సాగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు నిండి ఉండడంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరాటం తప్పదని, అంతేకాదు ప్రమాదకరమైన అటాకర్లతో నిండి ఉండడంతో గోల్స్ వర్షం కురుస్తుందనే అంచనాలతో ఈమ్యాచ్‌పై మరింత హైప్ నెలకొంది.
బెల్జియం జట్టు గత 23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే ఎరుగదు.. ఫిపా ప్రపంచకప్‌లోనూ అదే ఫాం. వరుస విజయాలు నమోదు చేస్తూ బెల్జియం జట్టు సెమీస్ చేరింది. గ్రూప్‌దశలో మూడు విజయాలు.. నాకౌట్ పోరులో 2-0తో వెనుకబడినా జపాన్‌పై విజయం సాధించడంతోపాటు క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై చిరస్మరణీయ విజయంతో సంచలనం సృష్టించింది. దీంతో ప్రపంచకప్ హాట్‌ఫేవరెట్ ముద్రతో సెమీస్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.
జట్లు అంచనా
ఫ్రాన్స్...
హ్యూగో లోరిస్, లుకాస్ హెర్నాండెజ్, సామ్యూల్ యుమిటిటి, రాఫెల్ వారనే, బెంజిమిన్ పావార్డ్, ఎంగోలో కాంటే, పాల్ పోగ్బా, ైబ్లెసే మాటిడి, ఆంటోనియో గ్రీజ్‌మన్, కైలియాన్ ఎంబాప్పే, ఒలివర్ గిరోడ్.
బెల్జియం...
టిబుట్ కౌర్టోస్, జాన్ వెర్టోంగెన్, మౌరోనే ఫెల్లాని, థామస్ వర్మాలెన్, టోబీ ఆల్డర్‌వీల్డ్, యాన్నిక్ కరోస్కో, ఆక్సెల్ విజెల్, రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, కెవిన్ డిబ్రుయెన్, నాసిర్ చాడ్లీ, రాబెర్టో మార్టినెజ్.