క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వాడకంలో జాగ్రత్తగా లేకుంటే...

గురువారం, 18 అక్టోబరు 2018 (12:45 IST)
ఇటీవలికాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటి సైబర్ నేరగాళ్ళు మనల్ని బురిడి కొట్టిస్తున్నారు. ఫలితంగా మన వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం సంగ్రహించి దర్జాగా మోసం చేసేస్తున్నారు. ఇందుకోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌లను సైతం ప్రవేశపెట్టి మరీ దోపిడీకి తెగబడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వినియోగం ఇలా ఏదైనా ఆన్‌లైన్‌లో మోసం చేయడం సులభమైపోయింది. ముఖ్యంగా, క్రెడిట్ - డెబిట్ కార్డు వాడకంలో అప్రమత్తంగా లేకపోతే జరిగే అనార్థాలేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. 
* ప్రతి కార్డుకీ వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డు వెరిఫికేషన్‌ వాల్యూ) నంబరు ఉంటుంది. దీన్ని గుర్తించుకుని కార్డుపై చెరిపివేయాలి.
* కార్డు స్వైప్‌ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ దృష్టి వారిపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి.
* క్రెడిడ్‌ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి దాని అకౌంట్‌ను తాత్కాలికంగా మూసేయండి.
 
* ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహరాలు సాగించనట్లైతే మీరు వినియోగిస్తున్న సైట్‌ అడ్రస్‌ హెచ్‌టీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
* కార్డులను పోగొట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి బ్లాక్‌ చేయించండి.
* కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతీసారీ ఆ సమాచారం ఈమెయిల్‌, ఎస్‌ఎమ్మెస్‌ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి.
* ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు షాపింగ్‌ మాల్స్‌లో ఏర్పాటుచేసే గిఫ్ట్‌ కూపన్లు, లక్కీడిప్స్‌, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్‌ నంబరుతో పాటు ఈ-మెయిల్‌ ఐడీలను గుడ్డిగా రాయకూడదు. నిర్వాహకులు ఈ విధంగా సేకరించిన డేటాను అనేక నకలీ సంస్థలకు విక్రయిస్తున్నారు.
 
* మార్కెటింగ్‌ సంస్థలు అనేక ఎత్తులను ప్రయోగిస్తాయి. వినియోగదారులను కలిసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నో ఉపయోగాలున్నాయని చెబుతూ ఆశ పెడతారు. అయితే సొమ్ము చెల్లించిన తర్వాత చేసుకునే అగ్రిమెంట్‌లో మాత్రం వీటి ప్రస్తావన ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు చెప్పిన విషయాలు, అగ్రిమెంట్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా? అన్నది సరిచూసుకోవాలి.
* ఏదైనా క్లబ్‌లో మెంబర్‌గా చేరే ముందు ఆ సంస్థ గురించి, వారిచ్చే సౌకర్యాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు