ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్ రేస్ ఎఫ్1. రెప్పపాటులో కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే వేగం, ప్రమాదకరమైన మలుపులు, పరీక్షించే ట్రాక్‌లు, పోటీపడే ప్రత్యర్థులు... ఫార్ములా వన్‌ను తలచుకోగానే ఈ దృశ్యాలే కనిపిస్తాయి. అయితే ఈ ఫార్ములా వన్ రేసింగ్ గురించి నివ్వెరపోయే వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎఫ్1 ఛాంపియన్‌షిప్ రేసులో ఫెరారీ, రెడ్‌బుల్ మెర్సిడెజ్ వంటి కంపెనీల కార్లు పాల్గొనడం కోసం ఆ కంపెనీలు ఒక్కొక్కటి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. ఎఫ్ 1 రేసులో విజేతగా నిలిచిన డ్రైవర్‌కు నగదు బహుమతి కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.