జి.ఎస్.టి... ధరలు తగ్గే వస్తువులు, పెరిగే వస్తువులు ఏవి?(వీడియో)
శనివారం, 1 జులై 2017 (14:19 IST)
జీఎస్టీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. దీనితో దీని ప్రభావం ఏ వస్తువులపై వుంటుందని సాధారణ ప్రజానీకం ఉత్సుకత నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి... ఏవి తగ్గుతాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మొత్తం 1211 వస్తువులు, సేవలకు సంబంధించిన పన్నురేటును ఖరారు చేసి పొందుపరిచింది. పన్ను రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా నిర్ణయించారు. ధరలు పెరిగేవి, తగ్గేవి ఏమిటో ఒకసారి చూద్దాం.
ఆహార పదార్థాలు (ధరలు పెరిగేవి)
* పన్నీర్
* కార్న్ ఫ్లేక్స్
* కాఫీ
* మసాలా పొడి
* చాక్ లెట్లు
* నెయ్యి
* బిస్కట్లు కొన్ని రకాలు
* చూయింగ్ గమ్
* ఐస్ క్రీమ్
* టీ కొన్ని రకాలు
ఎలక్ట్రానిక్స్ (ధరలు పెరిగేవి)
* ఎయిర్ కండిషనర్లు
* ఫ్రిడ్జ్ లు
* వాషింగ్ మెషీన్లు
* టెలివిజన్‌లు
* స్మార్ట్ ఫోన్లు
* ల్యాప్‌టాప్‌లు
* డెస్క్‌టాప్‌లు
ఇతరాలు (ధరలు పెరిగేవి)
* సుగంధ ద్రవ్యాలు
* ఆయుర్వేదిక్ - ఇతర ప్రత్యామ్నాయ ఔషధాలు
* బంగారం
* రూ.7500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ కలిగిన హోటళ్లు
* ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు
* ఫైవ్ స్టార్ హోటళ్ల లోపల ఉండే రెస్టారెంట్లు
* రూ.100 కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు
* కన్సర్ట్స్
* ఐపీఎల్ మ్యాచ్‌లు
* రూ.1000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు
* షాంపులు
* పెర్‌ఫ్యూమ్‌లు
* ఏసీ - ఫస్ట్ క్లాస్ రైలు టికెట్లు
* బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు
* కొరియర్ సర్వీసులు
* మొబైల్ ఫోన్ చార్జీలు
* బీమా ప్రీమియంలు
* బ్యాంక్ చార్జీలు
* బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
* క్రెడిట్ కార్డు బిల్లులు
* 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన ద్విచక్ర వాహనాలు