కర్కాటకరాశిలో జన్మించిన జాతకులు "ముత్యం"ను ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు అంటున్నారు. నవరత్నాలలో ఒకటైన "ముత్యం" తెలుపుగా పాలరాతి రంగులో ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున ఈ జాతకులు తరచూ మార్పుకోరుకునే వారుగా ఉంటారు. వీరిలో కల్పనాశక్తి, భావుకత్వం మెండుగా ఉంటుంది. ఇతరులతో అంత సామాన్యంగా కలిసిపోరు. సిగ్గుపడేవారుగానూ, వివేక వంతులుగానూ ఉంటారు.
ఈ రాశికి చెందిన జాతకులు ముత్యాన్ని ధరించడం ద్వారా చంద్రగ్రహ దోషాలను నివారిస్తుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఆవేశము, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ రాశిలో పుట్టిన ఆడవారు ఎక్కువగా ముత్యాల హారాలను ఉపయోగించడం మంచిది. అదేవిధంగా చెవులకు రింగ్స్‌గా కూడా ధరించవచ్చు. మగవారైతే చేతికి బంగారంతో పొదిగిన ముత్యాలను ఉంగరాలుగా ధరించవచ్చు.
ముత్యాన్ని ఎలా ధరించాలి? కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ముత్యపు ఉంగరాన్ని ధరించాలి. సోమవారం సూర్యోదయానికి ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వెండి లోహముతో పొదింగించిన ముత్యపు ఉంగరాలనే ధరించడం ఉత్తమం. ముత్యాన్ని ముందుగా పాలులోగానీ, గంగా జలములో గానీ శుద్ధి చేసిన తర్వాతే ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.