కృత్తికమూడోపాద జన్మకారుల రత్నధారణ!

శనివారం, 6 సెప్టెంబరు 2008 (18:07 IST)
కృత్తిక నక్షత్రం మూడోపాదంలో పుట్టిన వారికి మూడు సంవత్సరాల వరకు రవిమహర్దశ ప్రవేశించడంతో కెంపును వెండితో చేసుకున్న ఉంగరాన్ని ఉంగరపు వ్రేలుకు ధరించినట్లైతే మంచి ఫలితాలు దరిచేరుతాయని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

మూడు ఏళ్ళ నుండి 13 సంవత్సరాల వరకు చంద్రమహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు కుజమహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారంలో పొదిగంచి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

20 ఏళ్ళ నండి 38 సంవత్సరాల వరకు రాహుమహర్దశ సంచారం కారణంగా గోమేధికమును వెండిలో పొదిగి మధ్య వ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు.

38 సంవత్సరాల నుండి 54 ఏళ్ళ వరకు గురుమహర్దశ జరగడంతో కనకపుష్యరాగమును బంగారంతో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

54 సంవత్సరాల నుండి 73 ఏళ్ళ వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

73 ఏళ్ళ నుంచి 90 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి