చంద్రగ్రహ సంబంధ దోషాలు... పరిహారాలు

బుధవారం, 23 జనవరి 2008 (19:20 IST)
జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ, స్తన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, కంటి దోషాలు, కామెర్లు, ఆస్త్మా, రక్తహీనత, విరేచనాలు, ఇతర జలసంబంధ వ్యాధులు కలుగుతాయి. చంద్రుడు మానసిక వ్యాధులు కలగటానికి ప్రధాన కారకుడు.

వ్యాపారంలో నష్టం, బంధు విరోధం, మూత్రపీడ, స్త్రీల వ్యాధులు, నిద్రలేమి ఇత్యాది సమస్యలు చంద్రుడు బలహీనంగానూ, పాపగ్రహ సంబంధం కలిగినప్పుడు, దుస్థానంలో ఉన్నప్పుడు కలిగే సమస్యలు. దోష నివారణకు సోమవారంనాడు శ్రీ సూక్తంతో చంద్రగ్రహ మూల మంత్రంతో యథావిధిగా పూజలు నిర్వహించిన తరువాత ముత్యాన్ని ధరించాలి. చంద్రుని రంగు తెలుపు కనుక చంద్ర సంబంధ సమస్త దోషాలు ముత్యం ధరించినట్లయితే తొలగుతాయి.

వెబ్దునియా పై చదవండి