చిత్త రెండోపాదం : జన్మకారుల రత్నధారణ

శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (18:36 IST)
చిత్త రెండోపాదంలో జన్మించిన వారికి ఐదు సంవత్సరాల వయస్సు వరకు కుజమహర్దశ ప్రభావం కారణంగా పగడాన్ని బంగారంతో పొదిగించుకుని ఉంగరపువ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రనిపుణులు అంటున్నారు.

ఐదు సంవత్సరాల నుండి 23 ఏళ్ళ వరకు రాహుమహర్దశ జరగడంతో గోమేధికమును వెండితో పొదిగించి మధ్య వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

23 ఏళ్ళ నుంచి 39 సంవత్సరాల వరకు గురుమహర్దశ సంచరిస్తుండడంతో... కనక పుష్యరాగమును బంగారంలో పొదిగించుకుని చూపుడు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయి.

అదేవిధంగా 39 సంవత్సరాల నుండి 58 ఏళ్ళ వరకు శనిమహర్దశ ఉండటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభ ఫలితాలను ఇస్తాయని రత్నశాస్త్రకారులు పేర్కొంటున్నారు.

58 ఏళ్ళ నుంచి 75 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని వారు అంటున్నారు.

75 సంవత్సరాల నుంచి 82 సంవత్సరాల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించినట్లైతే సత్ఫలితాలు కలుగుతాయని రత్నాల శాస్త్రం పేర్కొంటుంది.

82 సంవత్సరాల నుండి 102 ఏళ్ళ వరకు శుక్రమహర్దశ ఉండటంతో... వజ్రాన్ని బంగారంతో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించగలరని రత్న శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి