పురోగతికి, గ్రహశాంతికి నవరత్నాలను ధరించడం మన సాంప్రదాయమని జ్యోతిష్కులు అంటున్నారు. భారతీయ సంస్కృతిలో నవరత్నాలు ధరించడం ఒక భాగమైందని, రత్నాలను ధరించడంలో అనేక పద్ధతులను అనుసరించడం పరిపాటైంది. ఇందులో కొన్ని నవరత్న ధారణ పద్ధతులు మీకోసం...
ముఖ్యంగా నవరత్న ధారణ పద్ధతుల్లో పాటించాల్సింది.... జన్మరాశికి ఆధిపత్యం గల గ్రహానికి ఏ రత్నం వర్తిస్తుందో దానిని ధరించడం. రెండోది జన్మ లగ్నానికి ఆధిపత్యం గల గ్రహానికి ఏ రత్నం వర్తిస్తుందో దానిని ధరించడం. ఇక మూడోది... ఏ గ్రహ దశ నడుస్తున్నదో ఆ గ్రహానికి వర్తించే రత్నాన్ని ధరించడం చేయాలని జ్యోతిష్కులు చెబుతున్నారు.
ఇకపోతే గ్రహాలు.. వాటికి వర్తించే రత్నాలను గురించి తెలుసుకుందామా?
సూర్యుడు (కెంపు), చంద్రుడు (ముత్యం), కుజుడు (పగడం), రాహువు (గోమేధికం), కేతువు (వైఢూర్యం), బుధుడు (పచ్చ), గురువు (పుష్యరాగం), శుక్రుడు (వజ్రం), శని (నీలం). నవగ్రహాలు ఏయే దశలో సంచరిస్తాయో, ఆయా దశకు సంబంధించిన రత్నాన్ని ధరించడం ద్వారా శుభఫలితాలు సంభవిస్తాయని జ్యోతిష్కుల సూచన.