పునర్వసు నాలుగోపాదం : జన్మకారుల రత్నధారణ...!

గురువారం, 25 సెప్టెంబరు 2008 (18:36 IST)
పునర్వసు నక్షత్రం నాలుగోపాదంలో జన్మించిన వారికి నాలుగు సంవత్సరాల వరకు గురుమహర్దశ సంచారం కారణంగా కనకపుశష్యరాగమును బంగారంలో పొదిగి చూపుడువ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటోంది.

నాలుగు సంవత్సరాల నుండి 23 ఏళ్ళ వరకు శనిమహర్దశ కావటంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

23 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు బుధమహర్దశ సంచరిస్తుండడంతో... పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

40 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల వరకు కేతుమహర్దశ సంచరిస్తుండడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

47 ఏళ్ళ నుంచి 67 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండడంతో... వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

67 సంవత్సరాల నుండి 73 సంవత్సరాల వరకు రవిమహర్దశ ఉండటంతో... కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

73 సంవత్సరాల నుండి 83 ఏళ్ళ వరకు చంద్రమహర్దశ జరగడంతో... ముత్యమును వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి