పుబ్బ నక్షత్రం మొదటి పాదములో పుట్టిన జాతకులు 20 సంవత్సరాల వరకు వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 20 సంవత్సరముల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అలాగే 20-26 సంవత్సరముల వరకు రవి మహర్ధశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం. 26-36 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదం. 36-43 వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించాలి.
ఇకపోతే.. 43-61వరకు పుబ్బ నక్షత్రం మొదటిపాదములో పుట్టిన జాతకులకు రాహు మహర్దశకావున గోమేధికమును వెండిలో మధ్యవేలుకు ధరించగలరు. 61 నుంచి 97 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున పుష్యరాగమును బంగారములో చూపుడు వేలుడు ధరించడం శ్రేయస్కరం.
అలాగే 77 సంవత్సరముల నుంచి 96 సంవత్సరముల వరకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో మధ్యవేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.